Bengaluru Lady Don: బెంగళూరు 'లేడీడాన్' యశస్వినీ గౌడ అరెస్ట్.. కిడ్నాప్ కేసులో నిందితుడి కోసం పోలీసులకే వార్నింగ్!

Bengaluru Lady Don: కర్ణాటక రాజధాని బెంగళూరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నగరంలో లేడీడాన్‌గా ముద్రపడిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు అరెస్టు చేశారు.
Bengaluru Lady Don: కర్ణాటక రాజధాని బెంగళూరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నగరంలో లేడీడాన్‌గా ముద్రపడిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు అరెస్టు చేశారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
గతేడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుడి నుంచి రాజేష్ అనే వ్యక్తి రూ. 1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని వ్యాపారి పదేపదే ఒత్తిడి చేయడంతో, రాజేష్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మబలికి వ్యాపారిని కిడ్నాప్ చేసి, కారులో తిప్పుతూ బెదిరించి మరికొంత నగదును బదిలీ చేయించుకున్నాడు.
ఈ కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు రాజేష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా, 47 ఏళ్ల యశస్వినీ గౌడ రంగంలోకి దిగింది. పోలీసులను అడ్డుకోవడమే కాకుండా, విధులకు తీవ్ర ఆటంకం కలిగించింది. దీంతో నిందితుడికి సహకరించినందుకు మరియు అధికారులను బెదిరించినందుకు గానూ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యశస్వినీ గౌడపై బెంగళూరు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఏడుకు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. తాజా కిడ్నాప్ కేసుతో ఆమె పాత్ర మరోసారి వెలుగులోకి రావడంతో సీసీబీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



