Bengal Election 2021 : వీల్‌చైర్‌లోనే సీఎం ధర్నా..!

Bengal Election 2021 : తన ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒక రోజు నిషేధం విధించాడన్ని నిరసిస్తూ కోల్ కతాలోని గాంధీ విగ్రహం దగ్గర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ధర్నా చేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 13 April 2021 2:09 PM IST
Bengal Election 2021 : Mamata Banerjee  holds protest against EC ban
X

Bengal Election 2021 : వీల్‌చైర్‌లోనే సీఎం ధర్నా..!

Bengal Election 2021 : తన ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒక రోజు నిషేధం విధించాడన్ని నిరసిస్తూ కోల్ కతాలోని గాంధీ విగ్రహం దగ్గర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ధర్నా చేస్తున్నారు. వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె ధర్నాలో పాల్గొంటున్నారు. కాసేపు సెల్ ఫోన్, కాసేపు డ్రాయింగ్ వేస్తూ దీదీ ధర్నా కొనసాగిస్తున్నారు.

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంలో పాల్గొంటున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌ ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గొనకూడ‌దంటూ ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించింది. బెంగాల్‌లో ముస్లింలంతా క‌లిసి తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థులకే ఓటేయాలని ఆమె అన‌డంతో పాటు కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాల‌ని, వారిపై తిరగబడాల‌ని ప్రజలను రెచ్చగొట్టడం వంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై ఈసీ ఆ నిర్ణ‌యం తీసుకుంది. తాను ఎన్నికల నియమావళి ఉల్లంఘించలేదని, ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ మమతాబెనర్జీ కొల్ కతాలో ధర్నా చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story