Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు షాక్

Amit Shah: అమిత్‌షాకు పశ్చిమబెంగాల్‌ స్పెషల్‌ కోర్ట్ సమన్లు జారీ చేసింది.

Samba Siva Rao
Published on: 19 Feb 2021 9:20 PM IST
AmitShah
X

అమిత్ షా  ఫైల్ ఫోటో (TheHansIndia)

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు(Amit shah) పశ్చిమ బెంగాల్‌లోని స్పెషల్‌ కోర్ట్ సమన్లు జారీ చేసింది. టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువు నష్టం కేసులో ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా గానీ..నాయర్‌ ద్వారా గానీ కోర్టులో హాజరుకావాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 2018లో కోల్‌కతాలో జరిగిన యువ స్వాభిమాన్‌ సమావేశ్‌ ర్యాలీలో టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి వ్యతిరేకంగా అమిత్‌షా వ్యాఖ్యలు చేశారు.

బెనర్జీపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగస్టు 28, 2018న అమిత్‌షాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రత్యేక కోర్టు అమిత్‌ షాకు సమన్లు జారీ చేసింది.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story