Mamata Benarjee: 6 నెలల సీఎంగా మమత.. మరి ఆ తర్వాత?

Bengal CM Mamata Benarjee
x

మమతా బెనర్జీ (ఫొటో ట్విట్టర్)

Highlights

Mamata Benarjee: బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కేవలం ఆరునెలలుగా ఉండనుంది. మరి ఆ తరువాత ఏంజరగనుంది.

Mamata Benarjee: బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కేవలం ఆరునెలలుగా ఉండనుంది. మరి ఆ తరువాత ఏంజరగనుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లో మూడో సారి ఫుల్ మోజార్టీతో అధికారంలోకి వచ్చింది తృణముల్‌ కాంగ్రెస్‌. ఆ పార్టీ 217 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది. కానీ, మమత మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ అధినేత మమతకు మాత్రం అధికారంలోకి వచ్చిన ఆనందం లేకుండా పోయింది. ఆమె సీఎంగా అధికారం చేపట్టాలంటే.. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలి. కానీ, ఫలితాలు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా వచ్చాయి.

అయితే ఆరు నెలల వరకు మమతకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారానికి ఎలాంటి అడ్డు కూడా లేదు. కాకపోతే ఆరు నెలల వరకు ఎలాగైనా మమత ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నికై ఉండాలి. లేకపోతే ఆమె ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశాన్ని కోల్పోతుంది. పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి లేకపోవడంతో ఎమ్మెల్సీగా పోటీ చేయడం కుదరదు. దీంతో ఆమెకు ఉన్న ఏకైక మార్గం ఎమ్మెల్యేగా గెలవాల్సిందే.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా సెకండ్ వేవ్ తో తీవ్రంగా కేసులు నమోదవడంతో సంసర్‌గంజ్, ముర్షిదాబాద్ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించలేదు. కాబట్టి, ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట మమత పోటీ చేసి గెలవాల్సిందే. అదికూడా ఆరు నెలలలోపే చేయాలి.

మరోవైపు బీజేపీ కూడా ఆమె మరోసారి గెలవకుండా తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. తాజా ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారం కోసం కంటే.. మమతను నందిగ్రామ్‌లో ఓడించేందుకు తీవ్రంగా శ్రమించింది. మమతను ఓడిస్తామని చేసిన శపథం నెరవేర్చుకుంది. ఇప్పుడు ఈ రెండు స్థానాలకు జరిగే ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ దృష్టి సారించింది. మమతను ఓడించి మరొకసారి షాకివ్వాలని ప్రయత్నాలు షూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories