BEL Recruitment: BELలో Research Staff ఉద్యోగాలు..

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం విదితమే.

Venkata Chari
Published on: 22 Feb 2021 9:34 PM IST
BEL Recruitment 2021
X

BEL (ఫైల్ ఫోటో )

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో BEL సంస్థ నుంచి మరోక ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఘజియాబాద్ లోని సంస్థకు చెందిన సెంట్రల్ రీసెర్చ్ లాబ్ లో ఖాళీగా ఉన్న పది Research Staff ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు సంస్థలో పర్మినెంట్ ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ. 1.60 లక్షల వరకు జీతభత్యాలు ఉంటాయి. దరఖాస్తులకు మార్చి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఈ పోస్టులకు బీఈ, బీటెక్ పూర్తి చేసి వారు అర్హులు కాగా, అభ్యర్థులు 65 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 55 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. అలాగే, అభ్యర్థులకు జనవరి 31 నాటికి 32 ఏళ్ల వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు c++, Java, Python, SW Documentation, algorithm development, SW Testing, Artificial intelligence and big data analyticsలో 4 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు BEL అధికారిక వెబ్ సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Venkata Chari

Venkata Chari

Next Story