Uttar Pradesh: పంచాయతీ ఎన్నికల్లో మిస్‌ ఇండియా పోటీ

Uttar Pradesh: మోడలింగ్‌ రంగంలో రాణించేవారు మిస్‌ ఇండియా టైటిల్స్‌ గెలుచుకున్నవారు సినీ రంగం వైపు చూడటం సహజం జరిగేదే.

Arun Chilukuri
Updated on: 3 April 2021 9:30 PM IST
Beauty Queen Diksha Singh Contesting Uttar Pradesh Panchayat Election
X

Uttar Pradesh: పంచాయతీ ఎన్నికల్లో మిస్‌ ఇండియా పోటీ

Uttar Pradesh: మోడలింగ్‌ రంగంలో రాణించేవారు మిస్‌ ఇండియా టైటిల్స్‌ గెలుచుకున్నవారు సినీ రంగం వైపు చూడటం సహజం జరిగేదే. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్‌ కమ్‌ అందాలరాణి పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. 2015 మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌గా ఉన్న దీక్షాసింగ్‌ మోడల్‌గా, ప్రయివేటు ఆల్బమ్స్‌తో పేరు, డబ్బు బాగానే సంపాదించారు. అయితే తన తండ్రి కోరిక మేరకు వచ్చే పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమె తన ప్రొఫెషన్‌ రీత్యా గోవాలో స్థిరపడినా ఇప్పుడు సొంత ప్రాంతంలో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. దీక్షాసింగ్‌ నిర్ణయం మోడలింగ్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story