BCG రిపోర్టు : అప్పటివరకు వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!

BCG రిపోర్టు : అప్పటివరకు వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!
x
Highlights

భారత్ లో కరోనా కట్టడికోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.ఏప్రిల్ 14 వరకూ ఇది కొనసాగనుంది.

భారత్ లో కరోనా కట్టడికోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.ఏప్రిల్ 14 వరకూ ఇది కొనసాగనుంది.ఈలోపే జనం ఇళ్లలోనుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నారు. ఈ తరుణంలో లాక్ డౌన్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలువడింది.

అయితే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్‌, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది. BCG అధ్యయనం ప్రకారం, ఏప్రిల్ 14 న భారతదేశం తన దేశవ్యాప్త కరోనావైరస్ లాక్డౌన్ ను నిలిపివేసే అవకాశం లేదు, ఈ పరిమితిని సెప్టెంబర్ మధ్య వరకు పొడిగించవచ్చు.

భారతదేశం COVID-19 లాక్డౌన్ ను జూన్ నాలుగవ వారం మరియు సెప్టెంబర్ రెండవ వారం మధ్య మాత్రమే ఎత్తివేస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక పేర్కొంది. ప్రిపరేషన్‌ లేకుండా ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ఆ సంస్థ భావించడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్‌ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు గత రెండు రోజుల కిందట లాక్ డౌన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

ఏప్రిల్‌ 15న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేయరని.. ఇంకా కొనసాగిస్తారని జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చింది. ఇందులో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. లాక్ డౌన్ ను పెంచే ఆలోచన లేదని పేర్కొంది. ఈ క్రమంలో బీసీజీ రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, దేశంలో మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఇదిలావుంటే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపుగా మూడు వేలకు చేరింది. ఇప్పటివరకు భారత్ లో కరోనాతో 72 మంది మృతి చెందారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories