Karnataka New CM 2021: కర్ణాటకలో పట్టు నిలుపుకున్న యడ్యూరప్ప

Karnataka New CM 2021: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ఊహాగానాలకు తెర పడింది.

Arun Chilukuri
Updated on: 28 July 2021 11:11 AM IST
Basavaraj Bommai is Karnataka New Chief Minister
X

Karnataka New CM 2021: కర్ణాటకలో పట్టు నిలుపుకున్న యడ్యూరప్ప

Karnataka New CM 2021: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ఊహాగానాలకు తెర పడింది. తాజాగా జరిగిన బీజేపీ సమావేశంలో కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మైను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన బసవరాజు బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నకయిన బసవరాజు షిగ్గావ్ నుంచి మూడు సార్లు ఎన్నికయ్యారు.

లింగాయత్‌ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story