2021లో బ్యాంక్‌ సెలవుల లిస్ట్ ఇదే

కొత్త సంవత్సరంలో బ్యాంకులకు నలభైపైగా సెలవు దినాలుగా నమోదు కానున్నాయి.

Samba Siva Rao
Published on: 28 Dec 2020 5:50 PM IST
2021లో బ్యాంక్‌ సెలవుల లిస్ట్ ఇదే
X

కొత్త సంవత్సరంలో బ్యాంకులకు నలభైపైగా సెలవు దినాలుగా నమోదు కానున్నాయి. ప్రతీ నెలా 2, 4వ శనివారాలు సెలవులన్న సంగతి తెలిసిందే. మిగతా సెలవు రోజులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా( RBI) విడుదల చేసిన వివరాలిలా ఉన్నాయి. జనవరిలో నెలలో 26న(మంగళవారం) రిపబ్లిక్ డే సెలవు. ఫిబ్రవరి, జూన్‌ నెలల్లో ప్రతీ 2,4వ శని వారాలకు తోడు ఆదివారం మాత్రమే బంద్‌కానున్నాయి.

ఇక మార్చిలో 11న(గురువారం) మహాశివరాత్రి,

మార్చి 29న(సోమవారం) హోలీ పండుగ,

ఏప్రిల్‌ నెలలో 1న(గురువారం) ఖాతాల ముగింపు రోజు

ఏప్రిల్ 2న గుడ్‌ ఫ్రైడే,

ఏప్రిల్14న(బుధవారం) అంబేడ్కర్‌ జయంతి,

ఏప్రిల్‌ 25న(ఆదివారం) మహావీర్‌ జయంతి,

మే 13న(గురువారం) రంజాన్‌ పండుగ,

జులై 20న(మంగళవారం) బక్రీద్‌,

ఆగస్ట్‌ 15న(ఆదివారం) స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్ట్‌ 19న(గురువారం) మొహర్రం,

అగస్ట్ 30న(సోమవారం) శ్రీకృష్ణ జన్మాష్టమి,

సెప్టెంబర్‌ 10న(శుక్రవారం) గణేశ్‌ చతుర్థి,

అక్టోబర్‌ 2న(శనివారం) గాంధీ జయంతి,

అక్టోబర్‌ 15న(శుక్రవారం) విజయ దశమి,

నవంబర్‌ 4న(గురువారం) దీపావళి,

నవంబర్‌19న(శుక్రవారం) గురునానక్‌ జయంతి,

డిసెంబర్‌ 25న(శనివారం) క్రిస్మస్‌

ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే మకర సంక్రాంతి(జనవరి 14న), అగస్ట్ 30న(సోమవారం) జన్మాష్టమి సందర్భంగా కొన్ని ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు అమలుకావచ్చ. వీటికితోడు శనివారం, ఆదివారాలు కలుపుకుని సమారు 40 రోజులకుపైగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story