Bangkok Road Collapse: బ్యాంకాక్‌లో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు

Bangkok Road Collapse: బ్యాంకాక్‌లో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు
x
Highlights

Bangkok Road Collapse: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బుధవారం ఉదయం ఒక ఆసుపత్రి ఎదుట భారీ గుంత ఏర్పడింది.

Bangkok Road Collapse: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బుధవారం ఉదయం ఒక ఆసుపత్రి ఎదుట భారీ గుంత ఏర్పడింది. దాదాపు 30 మీటర్ల పొడవు, 15 మీటర్ల లోతు వరకు రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, భూమి కింద మట్టి కుంగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. అయితే, రోడ్డుతో పాటు దాని కింద ఉన్న పైపులు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అధికారులు, వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసి మరమ్మతు పనులు ప్రారంభించారు. రోడ్ల నాణ్యత, భూగర్భ నిర్మాణాలు, భద్రతపై విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు, దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories