వ్యాక్సిన్ కోస‌మ‌ని కరోనా టెస్టు కేంద్రానికి వెళ్తే.. వెంట‌బ‌డి కొట్టారు

Viral Video: వ్యాక్సిన్ సెంటర్ అనుకుని కరోనా టెస్టు సెంటర్ కు వచ్చిన ఇద్దరు యువకులపై బెంగళూరు మహానగర పాలక సంస్థ సిబ్బంది దాడి చేశారు.

Arun Chilukuri
Published on: 25 May 2021 3:08 PM IST
Bangalore Teenager Boy Brutally Beaten by BBMP Officials for Refusing Corona Test Caught on Video
X

Viral Video: వ్యాక్సిన్ కోస‌మ‌ని కరోనా టెస్టు కేంద్రానికి వెళ్తే.. వెంట‌బ‌డి కొట్టారు

Viral Video: వ్యాక్సిన్ సెంటర్ అనుకుని కరోనా టెస్టు సెంటర్ కు వచ్చిన యువకులపై బెంగళూరు మహానగర పాలక సంస్థ సిబ్బంది దాడి చేశారు. నాగరత్‌పేట్ టెస్టింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. బెంగళూరులోని నాగరత్‌పేట్ టెస్టింగ్ కేంద్రంలో టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్‌లో వెయిట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత అది టీకా కేంద్రం కాదు, కొవిడ్ పరీక్షా కేంద్రం అని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

అది గమనించిన బీబీఎంపీ సిబ్బంది వారిని టెస్టు చేయించుకోవాలని కోరారు. కోవిడ్‌ టెస్ట్‌ చేసుకునేందుకు ఆ యువకులు నిరాకరించారు. దీంతో వారిద్దరిని టెస్టింగ్ సెంటర్ దగ్గరకు బలవంతంగా లాక్కెళ్లారు బీబీఎంపీ సిబ్బంది. టెస్టు చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంపై ఇద్దరు యువకులపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బీబీఎంపీ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story