బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్‌

బంగ్లాదేశ్‌కు చెందిన పెద్ద బెలూన్ అస్సాంలో కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 12 Jan 2026 3:04 PM IST
బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్‌
X

బంగ్లాదేశ్‌కు చెందిన పెద్ద బెలూన్ అస్సాంలో కలకలం రేపింది. కాచర్ జిల్లా బోర్ఖోలా ప్రాంతంలోని పొలంలో ఆదివారం పెద్ద బెలూన్ పడటాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని బెలూన్‌ను పరిశీలించారు.

బెలూన్‌పై బంగ్లాదేశ్ సిల్హెట్‌లోని గిలాచార ద్విముఖి హై స్కూల్ పేరు, ముగ్గురు వ్యక్తుల ఫొటోలు, బెంగాలీ భాషలో వ్యాఖ్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బెలూన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి అస్సాంలోకి ఎలా వచ్చింది అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story