కరోనా వ్యాక్సిన్.. ఓ వైద్యశాస్త్ర వైఫల్యం.. బాబా రాందేవ్ హాట్ కామెంట్స్..

Baba Ramdev: కరోనా వ్యాక్సిన్‌పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 6:44 PM IST
Baba Ramdev Said COVID-19 Vaccine is Medical Science Failure
X

కరోనా వ్యాక్సిన్.. ఓ వైద్యశాస్త్ర వైఫల్యం.. బాబా రాందేవ్ హాట్ కామెంట్స్..

Baba Ramdev: కరోనా వ్యాక్సిన్‌పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్యశాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బూస్టర్ డోసు వేసుకుంటే అది కాస్తా మళ్లీ కరోనా వచ్చేందుకు కారణమైందని తెలిపారు. ప్రపంచం మొత్తం మూలికా వైద్యంవైపు చూస్తోందన్నారు. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో పతంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కోట్లాది మంది ప్రజలు తమ ఇంటి వెలుపల తులసి, కలబంద, తిప్ప మొక్కలను పెంచుతున్నారని తెలిపారు. అంతకుముందు కూడా బాబా రాందేవ్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న అలోపతి ఔషదాల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మందుల కారణంగా లక్షలాది మంది చనిపోయారని తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story