Ayodhya Ram Mandir Bhumi Pujan: అయోధ్యలో భూమిపూజ ప్రారంభం
Ayodhya Ram Mandir Bhumi Pujan: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైంది. రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. తర్వాత భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన క్రతువు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ సీఎం ఉమాభారతి, యోగా గురు రామ్‌దేవ్ బాబా, పలువురు పీఠాధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Next Story




