Air India Crash: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

Aviation Minister Rammohan Naidu Addresses Air India Crash Probe in Parliament
x

Air India Crash: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

Highlights

Air India Crash: గత నెల అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

Air India Crash: గత నెల అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక నివేదిక ఇప్పటికే అందిందని, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. తుది నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని ముఖ్యమైన వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.

ఈ ఘటనపై విదేశీ మీడియా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. "వాస్తవాల ప్రకారం కాకుండా అనుమానాస్పదంగా, నిరాధారంగా ప్రచారం చేస్తున్నారు. ఇది తగినది కాదు" అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, "ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పారదర్శకంగా విచారణ చేపట్టింది. ఇప్పటికే బ్లాక్ బాక్స్‌ను డీకోడ్ చేయడంలో విజయం సాధించాం. డేటాను రికవర్ చేశాం. దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలను స్పష్టంగా గుర్తించగలిగాం" అని చెప్పారు.

ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణ, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

"ప్రత్యేక నివేదిక అనంతరం పూర్తి సమాచారం బయటకు వస్తుంది. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల భద్రత మా ప్రాధాన్యత. ఈ దిశగా మేము ముందుకు సాగుతున్నాం," అని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories