Karnataka: మహిళ న్యాయవాదిని కాలితో తన్నిన ఉన్మాది

Karnataka: అడ్చొచ్చిన భర్తపై దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది దంపతులు

Rama Rao
Updated on: 15 May 2022 12:22 PM IST
Attack on a Woman Lawyer in Karnataka | Telugu News
X

Karnataka: మహిళ న్యాయవాదిపై దాడి

Karnataka: మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో చోటు చేసుకుంది. న్యాయవాదిగా పని చేస్తున్న మహిళపై మహంతేష్‌ అమానుషంగా దాడి చేశాడు. మహిళను కాలితో తంతు ఉన్మాదిలా ప్రవర్తించాడు. అడ్డుచ్చిన భర్తపై కూడా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక బీజేపీ నేత అండతో మహంతేష్ తమపై దాడి చేశాడని మహిళ న్యాయవాది ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story