తమిళనాడు తిరువణ్ణామలైలో దారుణం..!

* భార్య సహా ఐదుగురు పిల్లలను నరికి చంపిన భర్త.. అనంతరం ఆత్మహత్య చేసుకున్న భర్త పళని

R Tripura Malini
Published on: 13 Dec 2022 1:25 PM IST
Atrocity In Tiruvannamalai Tamil Nadu
X

తమిళనాడు తిరువణ్ణామలైలో దారుణం..!

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య సహా పిల్లలను నరికి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో భూమిక అనే చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. భార్య వల్లీతో పాటు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు భర్త పళని. భార్య వల్లీ, చిన్నారులు శిరీష, మనీషా, శివశక్తి, ధనుష్ మృతి చెందారు. పళని దాడిలో భూమిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. భార్య, పిల్లలను గొడ్డలితో నరికి చంపిన తర్వాత పళని తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గంజాయి మత్తులో పళని ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. కొన్ని రోజులుగా ఆర్ధిక ఇబ్బందులతో పళని కుటుంబం బాధపడుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story