Heavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..

Heavy Rains: ఉత్తరాఖండ్‌ వరదల్లో ఓ ఏటీఎం నీటిలో కొట్టుకుపోయింది.

Arun Chilukuri
Updated on: 12 Aug 2022 7:30 PM IST
ATM Washed Away in Flood in Uttarakhand
X

Heavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..

Heavy Rains: ఉత్తరాఖండ్‌ వరదల్లో ఓ ఏటీఎం నీటిలో కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో 24 లక్షల రూపాయలు జమ చేశారు. నదిలో అది కొట్టుకుపోయే సమయానికి ఖాతాదారులు ఎంత జమచేశారన్న వివరాలు తెలియరాలేదు. ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో కుమోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. వరదలో ఏటీఎం కొట్టుకుపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story