ఉగ్రవాదుల మెరుపు దాడి.. ఆర్మీ ఆఫీసర్ ఫ్యామిలీతో పాటు మరో నలుగురు జవాన్లు మృతి

Manipur: మణిపూర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు.

Arun Chilukuri
Updated on: 13 Nov 2021 5:10 PM IST
Assam Rifles Commanding Officer Family Members, 4 Soldiers Killed in Terrorist Attack
X

ఉగ్రవాదుల మెరుపు దాడి.. ఆర్మీ ఆఫీసర్ ఫ్యామిలీతో పాటు మరో నలుగురు జవాన్లు మృతి

Manipur: మణిపూర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడ్డారు. చురచాంద్‌పూర్ జిల్లా సింఘట్ సబ్ డివిజన్‌లో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అసోం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్, మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ త్రిపాఠి తన కుటుంబ సభ్యులు, క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి కాన్వాయ్‌లో వస్తుండగా ఈ దాడి జరిగింది.

కాగా, మిలిటెంట్ల దాడి ఘటనను ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, మిలిటెంట్ దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story