Rahul Gandhi: రాహుల్‌ యాత్ర అడ్డగింత.. అస్సాంలో ఉద్రిక్తత

Rahul Gandhi: ప్రజలను కలవకుండా బీజేపీ కుట్ర చేస్తోంది

Shekhar G
Published on: 23 Jan 2024 3:14 PM IST
Assam Govt denies permission for Rahul yatra in Guwahati diverts route amidst tension
X

Rahul Gandhi: రాహుల్‌ యాత్ర అడ్డగింత.. అస్సాంలో ఉద్రిక్తత

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడ్ న్యాయ్‌ యాత్ర సందర్భంగా అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా రాహుల్ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రూట్ మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రాహుల్ ముందుకే సాగడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గుహవాటిలో కాంగ్రెస్‌ శ్రేణులకు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్రను అడ్డకోవడం మీద రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ఇదే మార్గంలో బీజేపీ నేతలు బజరంగ్‌ దళ్ యాత్ర చేసినప్పుడు అడ్డుకోలేదు. బీజేపీ ఛీఫ్ నడ్డా కూడా యాత్ర నిర్వహించారు. అప్పడు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పడు తమను మాత్రం ఆపుతున్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మేము చట్టాన్ని అతిక్రమించి ఏ పనీ చేయము అని చెప్పారు. ప్రజలను కలవకుండా..బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story