Lady Singham: అస్సోం లేడీ సింగం రభా దుర్మరణం.. హత్యా..?? ప్రమాదమా..??

Assam Controversial COP Junmoni Rabha Killed In Road Accident
x

Lady Singham: అస్సోం లేడీ సింగం రభా దుర్మరణం.. హత్యా..?? ప్రమాదమా..??

Highlights

* అస్సోం డేరింగ్ పోలీసాఫీసర్ జున్మోని రభా ప్రమాదంలో దుర్మరణం చెందారు. రభా ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీ కొనడంతో లేడీ సింగం తీవ్ర గాయాలపాలయ్యారు.

Lady Singham: అస్సోం లేడీ సింగం గుర్తుందా మీకు...ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ ఎన్నో క్లిష్టమైన కేసుల్నిసాహసోపేతంగా డీల్ చేసి జున్మోని రభా...లేడీ సింగంగా పేరు తెచ్చుకుంది. నేరస్థుల పాలిట కఠినంగా వ్యవహరించడంతో జున్మోని రభాను దబాంగ్ కాప్ అని కూడా పిలుస్తారు.

డేరింగ్ పోలీసాఫీసర్ గా డిపార్ట్ మెంట్ లో పేరు తెచ్చుకున్న రభా..రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘట్టన జరగగా సమాచారం అందుకున్న పోలీస్ పెట్రోలింగ్ టీమ్ సంఘటనా స్థలికి చేరి రభాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించిందని ధృవీకరించారు.

నేరస్థుల పాలిట సింహస్వప్నంగా జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో ఆమెను అరెస్ట్ చేయడంతో పాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ముగియడంతో తిరిగి ఆమె డ్యూటీలో చేరారు.

హత్యా..ప్రమాదమా..??

జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ఆమె ఎక్కడకు వెళ్తున్నారనేది ఎవరికీ సమాచారం లేదు. ప్రమాదం పై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే, సోమవారం రాత్రి జున్మోని అధికారిక క్వార్టర్స్ లో పోలీసుల బృందం దాడులు నిర్వహించి సుమారు రూ.లక్షను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు జున్మోని తల్లికి చెందిందని ఆమె అత్త సుబర్ణ బోడో అంటున్నారు.

ఎమ్మెల్యేతో వివాదం

గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నందున వీరిని అరెస్ట్ చేయగా..ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఫోన్ చేశారు. సదరు ఎమ్మెల్యేకు రభా ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు. ఈ ఆడియో టేప్ లీక్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories