Ashish Mishra: లఖీంపూర్‌ఖేరీ కేసులో ఆశిష్‌మిశ్రా అరెస్ట్

Ashish Mishra Arrested in Lakhimpur Kheri Case | Telugu Online News
x

Ashish Mishra: లఖీంపూర్‌ఖేరీ కేసులో ఆశిష్‌మిశ్రా అరెస్ట్

Highlights

Ashish Mishra: ఆశిష్‌మిశ్రాను 12 గంటలపాటు విచారించిన యూపీ పోలీసులు...

Ashish Mishra: లఖింపూర్‌ ఖేరి ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు అశిష్‌ మిశ్ర అరెస్ట్‌య్యాడు. యూపీ పోలీసులు అశిష్‌ మిశ్రను అరెస్ట్ చేశారు. ఈనెల 3న లఖింపూర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి అశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది.

రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో అశిష్‌ మిశ్ర పేరును పోలీసులు చేర్చారు. ఇందులో భాగంగా అశిష్‌ మిశ్రా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఎదుట అశిష్‌ హాజరయ్యారు. దీంతో పోలీసులు అశిష్‌ మిశ్రాను 11 గంటల పాటు ప్రశ్నించారు. ఇక విచారణకు సహకరించడం లేదని చివరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు అశిష్‌ మిశ్రను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories