Asaduddin Owaisi: ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవంపై ఒవైసీ సెటైర్లు

Asaduddin Owaisi: ఐఎన్ఎస్ విక్రాంత్ అందుబాటులోకి రావడంపై భారత నౌకాదళానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుభాకాంక్షలు చెప్పారు.

Arun Chilukuri
Published on: 2 Sept 2022 7:31 PM IST
Asaduddin Owaisi Targets PM Modi on INS Vikrants Commission
X

Asaduddin Owaisi: ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవంపై ఒవైసీ సెటైర్లు

Asaduddin Owaisi: ఐఎన్ఎస్ విక్రాంత్ అందుబాటులోకి రావడంపై భారత నౌకాదళానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ విమాన వాహక నౌకను 2013లోనే ప్రారంభించగా, ప్రధాని మోడీ ఇవాళ షో చేశారని ఒవైసీ ఎద్దేవా చేశారు. మరి మూడో విమాన వాహక నౌకను మోడీ సర్కార్ ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు. నేవీలో 200 నౌకలు అవసరమని, ప్రస్తుతం కేవలం 130 నౌకలు మాత్రమే ఉన్నాయని ఒవైసీ విమర్శించారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకే, ఆ యుద్ధ విమానాలను అనుమతించడం లేదని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story