logo
జాతీయం

సంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్ ఎదురుదాడి..

Arvind Kejriwal Slams Centre
X

సంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్ ఎదురుదాడి..

Highlights

Arvind Kejriwal: ప్రధాని మోడీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎదురుదాడి చేశారు.

Arvind Kejriwal: ప్రధాని మోడీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎదురుదాడి చేశారు. సామాన్యులపై పన్నుల భారం మోపుతూ, ధనికులకు మాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను సంతోషంగా ఉంచేందుకు ఢిల్లీ సీఎం వంటి నేతలు ఉచిత హామీల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారనే కేంద్రం వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఎక్కడికి పోతోందని ఆయన ప్రశ్నించారు. పాలు, పెరుగుపైనా జీఎస్టీ వసూలు చేస్తున్నా.. రాష్ట్రాల షేర్లను తగ్గించారని కేజ్రీవాల్ విమర్శించారు. 2014తో పోలిస్తే బడ్జెట్ రెండింతలు పెరిగినప్పటికీ అందులో 10 లక్షల కోట్లు కేవలం సంపన్నులకే దోచి పెట్టారని ఆయన ఆరోపించారు.

Web TitleArvind Kejriwal Slams Centre
Next Story