Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 10 May 2024 3:43 PM IST
Arvind Kejriwal Gets Interim Bail Till June 1
X

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 1 వరకు కేజ్రీవాల్‌ ఈ బెయిల్‌ వర్తించనుంది. అప్పటి వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తీర్పు అనంతరం సీఎం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో నేటి సాయంత్రంలోగా కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story