అరుణాచల్‌లో ఎగిసిపడుతున్న కార్చిచ్చు: రంగంలోకి వైమానిక దళం.. 9,500 అడుగుల ఎత్తులో సాహసోపేత ఆపరేషన్!

Arunachal Pradesh Forest Fire: అరుణాచల్‌ప్రదేశ్‌‌లోని లోహిత్‌ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది.

Arun Chilukuri
Published on: 30 Jan 2026 3:52 PM IST
అరుణాచల్‌లో ఎగిసిపడుతున్న కార్చిచ్చు: రంగంలోకి వైమానిక దళం.. 9,500 అడుగుల ఎత్తులో సాహసోపేత ఆపరేషన్!
X

Arunachal Pradesh Forest Fire: అరుణాచల్‌ప్రదేశ్‌‌లోని లోహిత్‌ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది. అటవిసంపద అగ్నికి ఆహుతైపోతోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం MI-17V5 హెలికాప్టర్‌లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది. అయితే, దాదాపు 9 వేల 500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్‌ చేయాల్సిరావడం రెస్క్యూ టీమ్స్‌కు మంటలను ఆర్పడం పెను సవాల్‌గా మారింది.

అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం, అటవీశాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కార్చిచ్చుకిగల కచ్చితమైన కారణాలు ఏవీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ మంటల వల్ల ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ సంభవించినట్లు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ముందుజాగ్రత్త చర్యగా కార్చిర్చు సంభవించిన ప్రాంతానికి పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వారికి అవసరమైన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story