పైలెట్ పృథ్వీ చౌహాన్ కు కన్నీటి నివాళి.. తండ్రి చితికి నిప్పు పెట్టిన ఏడేళ్ల తనయుడు
Pilot Prithvi Chauhan: ఆగ్రాలోని తాజ్ గంజ్ లో అంత్యక్రియలు పూర్తి
పైలెట్ పృథ్వీ చౌహాన్ కు కన్నీటి నివాళి.. తండ్రిచితికి నిప్పు పెట్టిన ఏడేళ్ల తనయుడు
Pilot Prithvi Chauhan: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పైలెట్ పృథ్వీ చౌహాన్ కు కన్నీటి నివాళుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.. ఆగ్రాలోని తాజ్ గంజ్ లో బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిపారు.. పృథ్వి ఏడేళ్ల కొడుకు, 12 ఏళ్ల కుమార్తె తండ్రి చితికి నిప్పంటించడం చూపరులను కంట తడి పెట్టించింది.
తన తండ్రి అడుగు జాడల్లోనే పయనించి పైలట్ అవుతానని, తన తండ్రే తనకు నిజమైన హీరో అని పృథ్వీ చౌహాన్ కుమార్తె తెలిపింది. మార్కులపై శ్రద్ధ కాదు.. చదువుపై దృష్టిపెట్టమని తన తండ్రి కోరేవారని ఆ చిన్నారి కన్నీటి పర్యంతమైంది.
Next Story




