అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం
x
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్...

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌ నుంచి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీలోని సీఎం అధికారిక నివాసం 1-జన్‌పథ్‌ నుంచి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా జలాల వివాదంపై రెండు రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. నాలుగు అంశాలను ఎజెండాగా నిర్ణయించినప్పటికీ, వీటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories