అమర్‌నాథ్‌ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు

Amarnath Yatra: ప.గో.జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 20 కుటుంబాల ఆచూకీ గల్లంతు

Jyothi
Published on: 9 July 2022 7:48 PM IST
AP Peoples in Amarnath Floods
X

అమర్‌నాథ్‌ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు

Amarnath Yatra: అమర్‌నాథ్‌ అకస్మిక వరదల్లో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు గల్లంతయ్యారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి 20 కుటుంబాలు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లినట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌, టీడీపీ పూర్వాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు తాడేపల్లిగూడెం పాల బుచ్చయ్య పాలకేంద్రంలో మేనేజర్‌గా పనిచేసే వ్యక్తి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు.

సిటీకేబుల్‌లో పనిచేస్తున్న జర్నలిస్టు అల్లూరి రామరాజు, ఆయన భార్య భవాని ఆచూకీ కూడా లభించలేదు. దీంతో వీరి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి సమాచారం కోసం తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు సమాచారం అందిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story