Coromandel Express: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీ ప్రయాణికులు..

Coromandel Express: 178 మంది ఏపీ ప్రయాణికులున్నట్లు గుర్తించిన రైల్వేశాఖ

Jyothi
Published on: 3 Jun 2023 6:00 PM IST
AP passengers in Coromandel Express
X

Coromandel Express: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీ ప్రయాణికులు..

Coromandel Express: ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 178 మంది ఆంధ్రప్రదేశ్‌కు చేరాల్సిన ప్రయాణికులు ఉన్నారు. 1ACలో 9, సెకెండ్ ACలో 17, 3Aలో 114, స్లీపర్ క్లాస్‌లో 38మంది ఏపీ ప్రయాణికులున్నారు. విజయవాడలో దిగాల్సిన వారు 33 మంది ఉండగా ఏలూరులో దిగాల్సిన వారు ఇద్దరు, తాడేపల్లిగూడెంలో ఒకరు, రాజమహేంద్రవరంలో దిగాల్సిన వారు 12 మంది ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన ప్రయాణికుల ఫోన్ నంబర్లు, ప్రయాణించిన కోచ్, బెర్తుల వివరాలను విజయవాడ స్టేషన్‌లోని హెల్ప్‌ లైన్‌ కేంద్రానికి అధికారులు పంపారు.

Jyothi

Jyothi

Next Story