AP CM Jagan: ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఏపీ సీఎం జగన్

AP CM Jagan: జీ20 సమావేశాల విజయవంతానికి బాధ్యతాయుత పాత్ర

R Tripura Malini
Published on: 6 Dec 2022 7:36 AM IST
AP CM Jagan Attended The All-Party Meeting Held In Delhi
X

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఏపీ సీఎం జగన్

AP CM Jagan: జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ వైపు ప్రపంచదేశాలు చూస్తున్న సమయంలో అందరూ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, దేశప్రయోజనాల దృష్ట్యా విభేదాలను పక్కన బెట్టి జీ20 సమావేశాలను విజయవంతం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాలులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి జగన్ హాజరయి తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జీ20 సమావేశాల నిర్వహణలో బాధ్యతాయుత పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story