యాంటీవైరస్ ఇడ్లీలు, దోసెలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్..

యాంటీవైరస్ ఇడ్లీలు, దోసెలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్..
x
Highlights

పేరులో ఏముందనుకునేరు.. చాలా ఉంటుంది మేటర్ ! ట్రెండ్ తగినట్లు పేరు మార్చుకున్నారే అనుకో.. ఫేట్ కూడా మారిపోతుంది. చాలాసార్లు చాలామంది విషయంలో ఇది ప్రూవ్...

పేరులో ఏముందనుకునేరు.. చాలా ఉంటుంది మేటర్ ! ట్రెండ్ తగినట్లు పేరు మార్చుకున్నారే అనుకో.. ఫేట్ కూడా మారిపోతుంది. చాలాసార్లు చాలామంది విషయంలో ఇది ప్రూవ్ అయింది కూడా ! ఐతే ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ ! మాయదారి వైరస్‌కు అంతం ఎప్పుడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ హోటల్ యజమాని ఆలోచన హాట్ టాపిక్ అయింది. ఒడిశాలోని బరంపురంలో ఉండే ఓ హోటల్ యజమాని తన హోటల్‌కు యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్ అని పేరు పెట్టాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయ్. ఈ హోటల్‌లో యాంటీ వైరస్ ఇడ్లీ దొరుకుతుందని కొందరు జోకులేస్తుంటే, తిండిలో శానిటైజర్ కలుపుతున్నాడేమో అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. పేరైతే యాంటీ వైరస్ అని పెట్టాడు కానీ వైరల్ అవుతున్న ఫొటోలో సోషల్ డిస్టన్స్ పాటిస్తున్న దాఖలాలయితే కనిపించట్లేదు ఇది చాలా బ్యాడ్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories