Satyendar Jain: మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. ఇవాళ జైలు అధికారితోనే.. వీడియో లీక్..

Satyendar Jain: ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ మరో వీడియో లీక్‌

Jyothi
Updated on: 26 Nov 2022 1:15 PM IST
Another Video leak of Delhi Minister Satyendar Jain
X

Satyendar Jain: మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. ఇవాళ జైలు అధికారితోనే.. వీడియో లీక్..

Satyendar Jain: ఢిల్లీ తీహార్‌ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్.. రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. ఆయనకు మసాజ్‌ చేయించుంటున్న వీడియోలు, ఫ్రూట్‌ సలాడ్‌ తింటున్న వీడియోలు చర్చనీయాంశంగా మారితే.. ఇప్పుడు జైలు అధికారులతో పిచ్చాపాటీ కాలక్షేపానికి సంబంధించిన వీడియో లీక్ అవడంతో ఆప్‌ మరింతగా ఇరకాటంలో పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు గుజరాత్ ఎన్నికలు, మరోవైపు ఎంసీడీ ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న ఆప్ కు.. సత్యేందర్ జైన్ వీడియోలు తలనొప్పిగా మారాయి. ఈ వీడియోలో... ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్.. జైలు సూపరింటెండెంట్ తో ముచ్చటిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Jyothi

Jyothi

Next Story