Drugs Case: గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌ కేసులో మరో ట్విస్ట్‌

Drugs Case: హెరాయిన్‌ కేసులో తెరపైకి ఏపీలోని ద్వారపూడి

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 1:54 PM IST
Another Twist in Gujarat Drugs Case
X

గుజరాత్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ (ఫైల్ ఇమేజ్)

Drugs Case: గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌ కేసులో మరోట్విస్ట్‌ చేసుకుంది. హెరాయిన్‌ కేసులో తెరపైకి ఏపీలోని ద్వారపూడి ప్రాంతం తెరపైకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా మాచవరపు సుధాకర్‌ను అనుమానిస్తున్న పోలీసులు, అత్తగారి ఇంటి అడ్రస్‌తో సుధాకర్‌ జీఎస్టీ లైసెన్స్‌ పొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే డ్రగ్‌ మాఫియాతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే సుధాకర్‌ చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లో ప్రైవేట్‌ జాబ్స్‌ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం తల్లి, సోదరుడితో కలిసి ద్వారపూడిలో నివాసం ఉంటున్న సుధాకర్‌, విశాఖలో జీవిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story