మళ్లీ అసంపూర్తిగా ముగిసిన రైతు సంఘాల చర్చలు

మళ్లీ అసంపూర్తిగా ముగిసిన రైతు సంఘాల చర్చలు
x

మళ్లీ అసంపూర్తిగా ముగిసిన రైతు సంఘాల చర్చలు

Highlights

నూతన వ్యవసాయ సాగు చట్టాలపై ప్రభుత్వం రైతు సంఘాలతో ఏర్పాటు చేసిన చర్చలు అసంపూర్తిగానే ముగిసాయి. ఇప్పటి వరకు 11 సార్లు రైతు సంఘాల ప్రతినిధులతో...

నూతన వ్యవసాయ సాగు చట్టాలపై ప్రభుత్వం రైతు సంఘాలతో ఏర్పాటు చేసిన చర్చలు అసంపూర్తిగానే ముగిసాయి. ఇప్పటి వరకు 11 సార్లు రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయినా కేంద్రం ప్రతిపాదనపై అంగీకారానికి రాలేదు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే ఏడాదిన్నర వరకు చట్టాలను అమలు చేయబోమని, సంయుక్త కమిటీ వేసి చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. గురువారం నాడు ఢిల్లీ సరిహద్దు సింఘు వద్ద సమావేశమైన రైతు సంఘాలు.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను ముక్తకంఠంతో తిరస్కరించాయి. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories