దేశంలో మంకీపాక్స్ రోజురోజుకు హడలెత్తిస్తోంది

Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది

Jyothi
Published on: 14 Aug 2022 9:37 AM IST
Another Monkeypox Case Has been Reported in Delhi
X

దేశంలో మంకీపాక్స్ రోజురోజుకు హడలెత్తిస్తోంది

Monkeypox: దేశంలో మంకీపాక్స్ రోజురోజుకు హడలెత్తిస్తోంది. ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌ నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన ఓ 22 ఏళ్ల యువతికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 5కు పెరిగింది. ప్రస్తుతం బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలో ఉందని LNJP ఆస్పత్రి డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఆ యువతి నెల రోజుల క్రితం విదేశాలకు వెళ్లి వచ్చిందన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నలుగురు మంకీపాక్స్ బాధితులు చికిత్స పొందుతున్నారు. మరొకరు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దేశంలో మొత్తం 9మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

Jyothi

Jyothi

Next Story