Kashmiri Pandit: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల బరితెగింపు... మరో కశ్మీరీ పండిట్ కాల్చివేత

Another Kashmiri Pandit was Shot Dead
x

Kashmiri Pandit: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల బరితెగింపు... మరో కశ్మీరీ పండిట్ కాల్చివేత

Highlights

Kashmiri Pandit: దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అచన్ ప్రాంతంలో ఘటన

Kashmiri Pandit: జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మరో కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సంజయ్ శర్మ.. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అచన్ ప్రాంతంలో సాయుధ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్‌కు వెళ్లిన సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న సంజయ్ శర్మను హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా లాభం లేపోయింది. సంజయ్ బంధువులు, స్నేహితుల రోధనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్ధరిల్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాల్పుల ఘటన తర్వాత రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories