Anant-Radhika Wedding : మూడుముళ్ల బంధంతో ఒక్కటైన అనంత్ -రాధిక..నేడు రిసెప్షన్ కు ప్రధాని మోదీ

Anant-Radhika Wedding : ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహాం అట్టహాసంగా జరిగింది. వధూవరుల వరమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివాహ వేదిక దగ్గరకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు.

Dhivi
Published on: 13 July 2024 7:07 AM IST
anant-ambani-radhika-merchant-marriage-pm-modi-likely-to-visit-wedding-reception
X

Anant-Radhika Wedding : మూడుముళ్ల బంధంతో ఒక్కటైన అనంత్ -రాధిక..నేడు రిసెప్షన్ కు ప్రధాని మోదీ

Anant-Radhika Wedding:రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహవేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ, పలు రంగా అతిరథ మహారథులు తరలివచ్చారు. పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ అగ్రతారాగణం, అంతర్జాతీయ వ్యాపార, క్రీడా కళా రంగాల ప్రముఖులు వివాహవేదిక దగ్గరకు చేరుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వీరి వివాహానికి హాజరయ్యారు. బీహార్ మాజీ సీఎం లాలూ కుటుంబ సభ్యులతో ముంబై వచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ఫేమస్ రెజ్లర్ జాన్ సీన, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు.

కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ముఖ్యమైన ప్రాజెక్టుల భూమిపూజను ప్రారంభించి, నిర్వహించనున్నారు.అనంత్ అంబానీ, రాధికా అంబానీల రిసెప్షన్‌కు కూడా ప్రధాని మోదీ హాజరవుతారని తెలుస్తోంది.పీఎంవో తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ సాయంత్రం 05.15 గంటలకు ముంబై విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో, అనంత్-రాధిక వివాహ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ హాజరవుతారని సమాచారం.

Dhivi

Dhivi

Next Story