Anant Ambani: వైభవంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం

Mukesh Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.

Arun Chilukuri
Published on: 20 Jan 2023 3:22 PM IST
Anant Ambani and Radhika Merchant Engagement Ceremony Held at Mukesh Ambanis Residence
X

Anant Ambani: వైభవంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం

Mukesh Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్‌, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. విరెన్ మర్చంట్‌ , శైల దంపతుల కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీకి ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని అంబానీ నివాసం ఈ వేడుకకు వేదికైంది. బంగారు వర్ణపు లెహంగాలో రాధిక మర్చంట్‌ మెరిసిపోయింది. ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు ఆట పాటలతో అలరించారు. గుజరాతీ హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబసభ్యుల ఆశీర్వాదాల మధ్య అనంత్ రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story