Anand Mahindra Share Video : ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ వీడియోను చూస్తా..

Anand Mahindra Share Video : ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూఫ్‌ చైర్మన్‌ ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి

Krishna
Updated on: 15 Aug 2020 3:05 PM IST
Anand Mahindra Share Video : ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ వీడియోను చూస్తా..
X
Anand Mahindra (File Photo)

Anand Mahindra Share Video : ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూఫ్‌ చైర్మన్‌ ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. తరచూ సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు అయన.. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అయన ఒక వీడియోని పోస్ట్ చేశారు.. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ అయన ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ వీడియోను చూస్తానని వెల్లడించారు.

ఇంతకి ఈ వీడియోలో ఎం ఉందంటే ఒక చిన్నపిల్లాడు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఉంటాడు. ఇది ఎంతో మంది అద్భుతమైన కళాకారులు చేసిన మ్యూజిక్‌ లా అనిపిస్తుంది. ఈ పిల్లోడి అమాయకత్వం, కాన్ఫిడెన్స్‌ నాలో జోష్‌ను నింపి నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అంటూ అయన పేర్కొన్నారు... ఆనంద్ మహీంద్రా మాదిరిగానే నెటిజన్లు కూడా ఈ వీడియోను ఇష్టపడుతున్నారు. పోస్ట్ క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోకి 680.5 k కంటే ఎక్కువ వ్యూస్ లభించాయి..


ఇక దేశవ్యాప్తంగా 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.. కరోనా విస్తరిస్తున్న సమయంలో జరుగుతున్న వేడుకలు కావడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ.. తమతమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు.

Krishna

Krishna

Next Story