గుజరాత్‌లోని ఓ హోటల్‌కు అనుకోని అతిధి

An unexpected guest at a hotel in Gujarat
x

Lion in Gujarat Hotel 

Highlights

* సీసీ కెమెరాల్లో రికార్డు అయిన సింహం విజువల్స్ * సరోవర్ పోర్టికో హోటల్లోకి గేటు దూకి వచ్చిన సింహం * హోటల్ చుట్టూ తిరిగి వెళ్లిపోయిన లయన్

గుజరాత్‌లోని ఓ హోటల్‌కు అనుకోని అతిధి వచ్చి వెళ్లిన దృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. సింహం అక్కడి ఓ హోటల్‌లో ప్రవేశించిన దృశ్యం అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియోను ఉదయ్ కచ్చి అనే ట్వీటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

జునాఘడ్‌లోని రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సరోవర్ పోర్టికో హోటల్‌లోకి సింహం గేటుదూకి వచ్చింది. ఈ ఘటన రాత్రి సమయంలో రావడంతో ప్రమాదం తప్పింది. హోటల్‌ మొత్తం కలియ తిరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి సింహం రావడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో సింహాలు జునాఘడ్‌కు వచ్చిపోవడం సాధారణం అయిపోయిందని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రాంతం గిర్నార్ కొండలకు సమీపంలో ఉన్నందున సింహాలు తరుచూ జనవాసంలోకి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories