Elephant Dance: బాలీవుడ్‌ సినిమా పాటకు నృత్యం చేసిన ఏనుగు

Elephant Dance: ఏనుగు బాలీవుడ్‌ సినిమా పాటకు చేసిన నృత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌

Sandeep Eggoju
Published on: 18 April 2021 7:42 AM IST
An Elephant Dancing to a Bollywood Movie Song
X
నృత్యం చేస్తున్న ఏనుగు (ఫైల్ ఇమేజ్)

Elephant Dance: ఏనుగు అంటే అందరికీ భారీ కాయంతో గంభీరంగా ఉంటుందని గుర్తుకు వస్తుంది. అయితే కొన్ని ఏనుగులు సరదా పనులు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఏనుగులు రహదారులను దాటుతూ.. అడవిలో మరో జంతువును రక్షిస్తూ, కొన్ని సమయాల్లో తమకు ఆపద కలిగించే జంతువులను తరుముతూ కనిపించిన సందర్బాలు చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ ఏనుగు బాలీవుడ్‌ సినిమా పాటకు చేసిన నృత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 'కేరళ ఎలిఫెంట్స్‌' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 'ఇది కర్ణాటకలోని కొడియాడ్కా ఆలయానికి చెందిన ఏనుగు 'లక్ష్మీ' చేసిన డాన్స్‌' అని కామెంట్‌ కూడా జత చేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story