Amul Milk: వినియోగదారులకు షాక్..అమూల్ పాల ధర లీటర్ రూ. 2 పెంపు

Amul Milk: వినియోగదారులకు షాక్..అమూల్ పాల ధర లీటర్ రూ. 2 పెంపు
x
Highlights

Amul Milk: వినియోగదారులకు షాకిచ్చింది అమూల్. పాల ధరను సవరించింది. అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్, అమూల్...

Amul Milk: వినియోగదారులకు షాకిచ్చింది అమూల్. పాల ధరను సవరించింది. అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్, అమూల్ ఛాయ్ మజా, అమూల్ తాజా, అమూల్ కౌ మిల్క్ ధరలను లీటర్ కు రూ. 2చొప్పున పెంచారు. అమూల్ బ్రాండ్ పాలను విక్రయించే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), కంపెనీ పాల కొత్త ధరలు గురువారం, మే 1, 2025 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది.

మదర్ డైరీ కూడా పాల ధరలను మంగళవారం నాడు పెంచింది. అన్ని రకాల ఉత్పత్తులపై రూ. 2మేల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గత కొద్ది నెలల్లో పాల సేకరణ ఖర్చు లీటర్ కు రూ. 4 నుంచి రూ. 5వరకు పెరిగినట్లు తెలిపింది. కొత్తగా సవరించిన ధరల ప్రకారం బల్క్ వెండెడ్ మిల్క్ ధర రూ. 54నుంచి రూ. 56కు, ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ. 69కి పెరిగింది. ఆవు పాల ధర లీటరుకు రూ. 57కు,డబుల్ టోన్డ్ పాల ధర లీటర్ కు రూ. 51కి చేరింది.

ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ మార్కెట్లలో అముల్ పాల కొత్త ధరలు వర్తిస్తాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల పాల ధరలు పెరిగాయి. గత సంవత్సరం ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీని వలన పాల ధరలు పెరగాల్సి వచ్చింది. ఈసారి వేసవి కాలం ముందుగానే ప్రారంభమైంది. వేడిగాలులు కూడా ప్రారంభమయ్యాయి. దీని కారణంగా జంతువుల పాల ఉత్పత్తి తగ్గడం ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories