Amritpal Singh: పోలీసుల ఎదుట లొంగిపోవాలని అమృత్‌పాల్‌సింగ్‌కు పిలుపు

Amritpal Singh: తక్షణమే లొంగిపోవాలని ఆదేశించిన అకాల్‌తక్త్

Dhatripriya
Published on: 27 March 2023 10:12 AM IST
Amritpal Singh Was Called To Surrender Before The Police
X

Amritpal Singh: పోలీసుల ఎదుట లొంగిపోవాలని అమృత్‌పాల్‌సింగ్‌కు పిలుపు

Amritpal Singh: సిక్కులకు పరమపవిత్రమైన అకాల్‌ తక్త్‌ నుంచి అమృత్‌పాల్‌సింగ్‌కు పిలుపు వచ్చింది. వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని అకాల్‌ తక్త్‌ జత్యేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ కోరారు. పెద్ద దళాన్ని పెట్టుకొని పోలీసులు ఇప్పటి వరకు అమృత్‌పాల్‌ను అరెస్టు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమృత్‌పాల్‌ బయటే ఉంటే.. పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని కోరేవాడినని తెలిపారు. ఈ జత్యేదార్‌ జ్ఞాని ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ పరిస్థితిపై చర్చించేందుకు దాదాపు 70 సిక్కు సంస్థలతో సమావేశం కావాలని హర్‌ప్రీత్‌ నిర్ణయించారు. ఇప్పటికే అమృత్‌పాల్‌ తల్లిదండ్రులు మాత్రం పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story