Amit Shah: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా ఇంటింటి ప్రచారం

Amit Shah: గోల్డెన్ గోవా కావాలో.. గాంధీ కుటుంబానికి చెందిన గోవాగా.. రాష్ట్రం మారాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

Rama Rao
Updated on: 30 Jan 2022 8:31 PM IST
Amit Shahs House Campaign in Goa Assembly Elections | National News
X

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా ఇంటింటి ప్రచారం

Amit Shah: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 22కు పైగా స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పోండాలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గోవాను కాంగ్రెస్ ఓ వెకేషన్ స్పాట్‌గా చూస్తోందని కానీ బీజేపీ మాత్రం గోవాను గోల్డెన్ గోవాగా చూస్తోందని చెప్పారు. బీజేపీ తెచ్చే గోల్డెన్ గోవా కావాలో లేక గాంధీ కుటుంబానికి చెందిన గోవాగా రాష్ట్రం మారాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story