Amit Shah: తమిళిసైకి అమిత్‌ షా వార్నింగ్

Amit Shah: తమిళిసైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్ తీసుకున్నారా..?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Jun 2024 4:37 PM IST
Amit Shah Class to Tamilisai Soundararajan At Chandra Babu Oath Ceremony
X

Amit Shah: తమిళిసైకి అమిత్ షా క్లాస్..!

Amit Shah: తమిళిసైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్ తీసుకున్నారా..? తమిళనాడు బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చలో భాగంగా ఆమె వైఖరిపై షా సీరియస్ అయ్యారా..? ఇరువురి నేతల మధ్య జరిగిన సంభాషణ చూస్తూంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర నేతలతో పాటు తమిళిసై కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే తమిళిసై స్టేజీ పైకి వచ్చి నేతలకు నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా..అక్కడే ఉన్న అమిత్ షా పిలిచి ఆమెతో మాట్లాడారు. ఈ వీడియోలో అమిత్ షా తమిళిసైని మందలించినట్లు కనిపించింది. ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై తమిళిసై విమర్శలు చేసిన నేపథ్యంలో అమిత్ షా ఆ ఇష్యూనే ప్రస్తావించి తమిళిసైని మందలించినట్లు ప్రచారం జరుగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story