రైతు సంఘాలతో చర్చలకు ముందు అమిత్‌షా కీలక భేటీ

Samba Siva Rao
Published on: 29 Dec 2020 6:10 PM IST
రైతు సంఘాలతో చర్చలకు ముందు అమిత్‌షా కీలక భేటీ
X

నూతన చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ శివారుల్లో రైతుల ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలో రేపురైతు సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. అయితే కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం మరోసారి చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల డిమాండ్లు, కేంద్రం ప్రతిపాదనలపై స్పందించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రి, చిల్లా, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో రైతులు తమ నిరసన సాగిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో షా సమావేశమయ్యారు.

నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు అభ్యతరం తెలుపుతుండటంతో ఈ నెల 30న మరోసారి చర్చలు జరపుదామని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు రైతు సంఘాలు కూడా అంగీకరించాయి. అయితే మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అమలుపై చర్చించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు చర్చల రోజు కూడా అన్నదాతల ఉద్యమం సాగనుంది. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో బుధవారం రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టనున్నారు.

వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగనుండటం ఇది ఆరోసారి. ఇప్పటివరకు 5 సార్లు కేంద్రం చర్చలు జరిగినప్పటికీ విఫలమైయ్యాయి. రైతు సంఘాలు సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టగా సవరణలు తెస్తామని కేంద్రం చెబుతోంది. అయితే ఈసారైనా ప్రతిష్టంభన వీడుతుందో లేదో చూడాలి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story