Amit Shah: పాకిస్తాన్‌కు అమిత్ షా పరోక్ష హెచ్చరికలు

Amit Shah indirect Warning to Pakistan
x

Amit Shah: పాకిస్తాన్‌కు అమిత్ షా పరోక్ష హెచ్చరికలు

Highlights

Amit Shah: జమ్మూకాశ్మీర్ బారాముల్లాలో అమిత్ షా ర్యాలీ

Amit Shah: పాకిస్తాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూకాశ్మీర్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జమ్ము కాశ్మీర్‌ను దేశంలోనే అంత్యంత శాంతియుత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. అయితే పాకిస్తాన్ అధికారులతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఉన్న షా.. బారామూల్లాలో ఆవేశపూరితంగా మాట్లాడారు. ఎప్పుడైనా ఎవరికైనా ఉగ్రవాదం మంచి చేసిందా? అని ప్రశ్నించారు. 1990 నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్‌లో ఉగ్రవాదం 42 వేల ప్రాణాలను బలి తీసుకుందని అన్నారు. 1947 స్వాతంత్ర్యం తర్వాత కాశ్మీర్‌ను పరిపాలించిన నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లా, పీడీపీ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌కు చెందిన గాంధీ కుటుంబాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories