Amit Shah Admitted To AIIMS: మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్‌ షా

Arun Chilukuri
Published on: 18 Aug 2020 12:56 PM IST
Amit Shah Admitted To AIIMS: మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్‌ షా
X

Amit Shah Admitted To AIIMS: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురై, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. తాజాగా శ్వాసకోశ సమస్యతోపాటు రెండు మూడు రోజులుగా ఒంటి నొప్పులు రావడంతో ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో అమిత్‌ షాకు చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన అర్ధరాత్రి 2 గంటలకు ఎయిమ్స్‌లో చేరినట్లు సమాచారం. కాగా, ఆగస్ట్‌ 2న అమిత్‌ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనలతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అనంతరం కరోనా నుంచి కోలుకున్న ఆయన గత శుక్రవారం( ఆగస్ట్‌ 14) ఇంటికి వచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story