Amit Shah: పార్లమెంట్ కొత్త భవనాన్ని మోడీ జాతికి అంకితమిస్తారు

Amit Shah: ఈ నెల 28న సెంట్రల్ విస్టా ప్రారంభం జరుగుతుంది

Dhatripriya
Published on: 24 May 2023 1:03 PM IST
Amit Shah About New Parliament Bulding
X

Amit Shah: పార్లమెంట్ కొత్త భవనాన్ని మోడీ జాతికి అంకితమిస్తారు

Amit Shah: ఈ నెల28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని విపక్ష పార్టీలను ఆహ్వానించినట్లు తెలిపారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభాన్ని విపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని అన్నారు. ప్రధాని దూరదృష్టికి కొత్త పార్లమెంట్‌ భవనమే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నెల28 చాలా ముఖ్యమైన రోజు అని అమిత్ షా అన్నారు. పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా భారత నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన వస్తువు సంగోల్‌ను ప్రధాని మోడీ స్వీకరిస్తారని తెలిపారు. బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడికి ప్రతీకగా నిలిచిన చారిత్రక సెంగోల్ కొత్త పార్లమెంట్ హౌజ్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త పార్లమెంట్ నిర్మాణంలో దాదాపు 7వేల మంది కార్మికులు పనిచేశారని... వారందరినీ ప్రధాని మోడీ సత్కరిస్తారని అమిత్ షా వివరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story